ఓ తల్లి కడుపుకోత.. వినూత్న రీతిలో నిరసన

81చూసినవారు
ఓ తల్లి కడుపుకోత.. వినూత్న రీతిలో నిరసన
శ్రీకాకుళం జిల్లాలో ‘ఓ తల్లికి కడుపుకోత’ పేరిట వెలిసిన ఫ్లెక్సీలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. వివరాల్లోకి వెళ్తే.. టెక్కలి మండలం చిన్ననారాయణపురం గ్రామానికి చెందిన మురళి, నిరోషా దంపతులకు సాయివినీత్ (12) అనే కొడుకు ఉన్నాడు. సాయివినీత్‌కు పాము కరవడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ముళ్లు గుచ్చుకుందని వైద్యులు వైద్యం చేయలేదు. దాంతో ఆ యువకుడు మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యంతో వల్లే కొడుకు మృతి చెందాడని తల్లి నిరసన చేపట్టింది.

సంబంధిత పోస్ట్