పవన్‌ గెలుపు కోసం.. మోకాళ్లపై తిరుమల మెట్లెక్కిన యువతి

81చూసినవారు
పవన్‌ గెలుపు కోసం.. మోకాళ్లపై తిరుమల మెట్లెక్కిన యువతి
ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ గెలవాలని కోరుతూ తూ.గో జిల్లా ఉండ్రాజవరానికి చెందిన పసుపులేటి దుర్గా రామలక్ష్మి మోకాళ్లపై తిరుపతి మెట్లు ఎక్కారు. మే 25న సుమారు 450 మెట్లు మోకాళ్లపై ఎక్కి పవన్‌కల్యాణ్‌ గెలవాలని తిరుమల వెంకటేశ్వరస్వామికి మొక్కుకున్నారు. పార్టీలతో సంబంధం లేదని, కేవలం పవన్‌పై ఉన్న అభిమానంతోనే మెట్లు ఎక్కినట్లు వివరించారు. పిఠాపురం నుంచి పవన్‌ భారీ మెజార్టీతో గెలుస్తారని దీమా వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్