నా స్థానంలో ఆప్ నుంచి మరో నేత ముఖ్యమంత్రి అవుతారు: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

70చూసినవారు
నా స్థానంలో ఆప్ నుంచి మరో నేత ముఖ్యమంత్రి అవుతారు: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
రెండు రోజుల తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. మరో రెండు, మూడు రోజుల్లో తమ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నట్లు ఆయన చెప్పారు. తన స్థానంలో ఆమ్ ఆద్మీ నుంచి మరో నేత సీఎంగా బాధ్యతలు చేపడతారని ఆయన తెలిపారు. 2025లో జరగాల్సిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను మహారాష్ట్రతో కలిసి నవంబర్‌లోనే నిర్వహించాలని కేజీవాల్ డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్