త్వరలోనే భారీ సౌర తుఫాను భూమిని తాకనున్నది. ఇది కమ్యూనికేషన్ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని నాసా హెచ్చరించింది. సూర్యుడి ఉపరితలంపై పేలుళ్లు సంభవిస్తుంటాయి. దాని కారణంగా ఏర్పడే కణాలు, అయస్కాంత క్షేత్రాలు, ఇతర పదార్థాలతో కలిసి అవి భూమి వాతావరణాన్ని తాకుతుంటాయి. దీన్నే సౌర తుఫానుగా పేర్కొంటుంటారు. ఈ సౌర తుఫానును ఇస్రో శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు.