ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా పలు ప్రాంతాలపై ఆదివారం డ్రోన్లు, క్షిపణులతో రష్యా విరుచుకుపడింది. శీతాకాలం వస్తుండటంతో ఉక్రెయిన్ వాసులను చలికి బలి చేయడానికి ఇక్కడి పవర్ గ్రిడ్‌ను లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు జరిగినట్లు భావిస్తున్నారు. రష్యా మొత్తం 120 క్షిపణులు, 90 డ్రోన్లను తమపై ప్రయోగించిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు.