ఏపీ నుంచి మరొకరికి కేంద్రమంత్రి పదవి

64చూసినవారు
ఏపీ నుంచి మరొకరికి కేంద్రమంత్రి పదవి
ఏపీ నుంచి భాజపాకు చెందిన నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మను కేంద్ర క్యాబినెట్‌లోకి తీసుకోనున్నారు. ఈ మేరకు పీఎంవో నుంచి ఆయనకు సమాచారం వచ్చింది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి గూడూరి ఉమాబాలపై 2.76లక్షల ఓట్ల మెజార్టీతో శ్రీనివాస వర్మ ఘన విజయం సాధించడంతో కేంద్ర మంత్రివర్గంలో బెర్తు ఖరారైంది. శ్రీనివాస వర్మ దశాబ్దాలుగా భాజపాకు సేవలందిస్తున్నారు.