ఏ నాయకుడైనా శిక్ష అనుభవించాల్సిందే: మంత్రి

65చూసినవారు
ఏ నాయకుడైనా శిక్ష అనుభవించాల్సిందే: మంత్రి
బీఆర్ఎస్ చేసిన తప్పుకు ఏ నాయకుడైనా శిక్ష అనుభవించాల్సిందేనని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తప్పులు చేసినట్టు తెలిస్తే.. కేటీఆర్, హరీశ్ రావు, మాత్రమే కాదు.. కేసీఆర్, కవితకు సైతం శిక్ష తప్పదు అన్నారు. తప్పులు చేసిన వారు భుజాలు తడుముకుంటున్నారని సెటైర్లు వేశారు. ఫార్ములా-ఈ రేసు కేసు వ్యవహారంలో కేటీఆర్ అరెస్టు అవుతానని ముందుగానే మానసికంగా సిద్ధం అవుతున్నారని విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్