మధ్యాహ్నం కునుకు తీస్తున్నారా.. అయితే డయాబెటిస్‌ పరీక్ష చేయించుకుంటే మంచిది

78చూసినవారు
మధ్యాహ్నం కునుకు తీస్తున్నారా.. అయితే డయాబెటిస్‌ పరీక్ష చేయించుకుంటే మంచిది
మధ్యాహ్నం వేళల్లో గంటకు మించి నిద్రిస్తున్న వారు డయాబెటిస్‌ పరీక్ష చేయించుకోవడం మంచిదట. మూడు లక్షలకు పైగా వ్యక్తుల నుంచి సేకరించిన సమాచారంపై జరిపిన ఓ అధ్యయనం ఆధారంగా పరిశోధకులు ఈ సలహా ఇస్తున్నారు. ఈ అధ్యయనంలో పగటిపూట రోజుకు గంటకంటే ఎక్కువసేపు నిద్రించిన వారిలో.. నిద్రించని వారికంటే టైప్‌ 2 డయాబెటిస్‌ ముప్పు 45 శాతం ఎక్కువని గుర్తించారు. అయితే, డయాబెటిస్‌ ఉన్నందువల్ల ఈ మేరకు నిద్రిస్తున్నారా, లేదంటే పగటి నిద్రవల్ల డయాబెటిస్‌ వస్తోందా అనే దానిపై స్పష్టత లేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్