ఢిల్లీలో గాలి నాణ్యత రెండో రోజు కూడా క్షీణించి కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకున్నది. కాలుష్య తీవ్రతను నిరోధించడానికి నగర వ్యాప్తంగా కృత్రిమ వర్షం కురిపించడమొక్కటే మార్గమని, ఇందుకు అనుమతించాలని ఢిల్లీ సర్కారు కేంద్రాన్ని కోరింది. ఈ సంక్షోభంపై ప్రధాని జోక్యం చేసుకోవాలని అభ్యర్థించింది. ఈ మేరకు సోమవారం నమోదైన గాలి నాణ్యత సూచీ (490)తో పోలిస్తే మంగళవారం(460) స్వల్పంగా మెరుగుదల ఉన్నా ఇంకా ప్రమాదకర స్థాయిలోనే ఉందని తెలిపింది.