ఆసియా ఛాంపియ‌న్స్ ట్రోఫీ హాకీ ఫైన‌ల్.. చైనా జెండాతో పాకిస్థాన్ ఆట‌గాళ్లు

58చూసినవారు
ఆసియా ఛాంపియ‌న్స్ ట్రోఫీ హాకీ ఫైన‌ల్.. చైనా జెండాతో పాకిస్థాన్ ఆట‌గాళ్లు
చైనా వేదిక‌గా జ‌రిగిన ఆసియా ఛాంపియ‌న్స్ ట్రోఫీ ఫైనల్ లో చైనాపై భార‌త హాకీ జ‌ట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్‌ సందర్భంగా పాక్ ఆటగాళ్లు స్టేడియంలో చైనాకు మద్దతుగా ఆ దేశ జెండాలు పట్టుకొని కూర్చున్నారు. సెమీస్ లో చైనా చేతిలో ఓడిన పాక్ జట్టు, 3వ స్థానం కోసం జరిగిన పోరులో గెలిచాక ఫైనల్ ను వీక్షించింది. చైనాపై భారత్ 1-0తో విజయం సాధించింది. ఈ ఫోటోలపై “ఇది పాక్ కు బాధ కలిగించే క్షణం" అని ఒకరు, "వారు తమ స్పాన్సర్లకు మద్దతిస్తున్నారు" అని మరో యూజర్ కామెంట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్