భాద్రపద మాసం పౌర్ణమి రోజున (సెప్టెంబర్ 18, బుధవారం) చంద్ర గ్రహణం ఏర్పడనుంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 6:12 గంటలకు ప్రారంభమవుతుంది. రాత్రి 10.17 గంటలకు ముగుస్తుంది. ఈ కాలంలో గర్భిణులు బయటకు రాకూడదని పండితులు సూచిస్తున్నారు. కడుపులో పెరుగుతున్న శిశువుకు ఈ కాలం మంచిది కాదు. చంద్రగ్రహణం సమయంలో ఇంటి లోపల ఉండాలని సంప్రదాయంగా విశ్వసిస్తారు. శాస్త్రీయ ఆధారాలు లేనప్పటికీ దీనిని పాటిస్తారు.