జులై రెండో వారంలో అసెంబ్లీ సమావేశాలు?

53చూసినవారు
జులై రెండో వారంలో అసెంబ్లీ సమావేశాలు?
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జులై రెండో వారంలో జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ సమావేశాల్లో పూర్తిస్థాయి బడ్జెట్ కు ఆమోదముద్ర వేయడంతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. కేంద్రం పూర్తిస్థాయి బడ్జెట్ ను జులై రెండు లేదా మూడో వారంలో ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో అందులో రాష్ట్రానికి వచ్చే కేటాయింపులను చూసుకొని దానికి అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :