ఏపీలో ప్రబలిన అతిసారం

83చూసినవారు
ఏపీలో ప్రబలిన అతిసారం
ఏపీలోని కాకినాడ జిల్లా తొండంగి మండలం కొమ్మనపల్లిలో అతిసారం విజృంభిస్తోంది. సుమారు 50 మంది తీవ్ర విరోచనాలు, వాంతులతో అస్వస్థతకు గురయ్యారు. అధికారులు గ్రామంలోనే వైద్య శిబిరం ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అతిసారం ప్రబలడానికి గల కారణాలను అధికారులు పరిశీలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్