కంట్లో కొయ్య దిగినా.. తిరిగొచ్చిన చూపు

72చూసినవారు
కంట్లో కొయ్య దిగినా.. తిరిగొచ్చిన చూపు
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం గురధరపాలేనికి చెందిన మీసాల నాగేశ్వరరావు (39) ఈ నెల 4న ఇంటి మొదటి అంతస్తు నుంచి కిందికి దిగుతూ కాలు జారి పడిపోయాడు. అప్పుడు 12 అంగుళాల పొడవున్న కొయ్య అతని కుడి కంట్లో చొచ్చుకుపోయింది. నాగేశ్వరరావుకు వైద్యులు శస్త్రచికిత్స చేసి విజయవంతంగా కొయ్యను తొలగించారు. శస్త్రచికిత్స సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో కన్ను, కంటి నరాలకు నష్టం జరగలేదు. ఫలితంగా కంటి చూపు మళ్లీ వచ్చింది.

సంబంధిత పోస్ట్