దేవుడిపై హాస్యం తప్పుకాదు: పోప్ ఫ్రాన్సిస్

69చూసినవారు
దేవుడిపై హాస్యం తప్పుకాదు: పోప్ ఫ్రాన్సిస్
ఎవరినీ నొప్పించనంత కాలం దేవుడిపై జోకులు వేయడం తప్పు కాదని పోప్ ఫ్రాన్సిస్ అన్నారు. ప్రపంచం నలుమూలల నుండి 100 మంది హాస్యనటులు, నటులు మరియు రచయితలు ఇటీవల ఆయనను కలిశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో పోప్ మాట్లాడారు. ‘దేవుడిని చూసి మనం నవ్వొచ్చా? అదేమీ చేయకూడని పని కాదు కాబట్టి తప్పులేదు. మనం ప్రేమించిన వారిపైనా అప్పుడప్పుడూ జోకులేస్తాం కదా? ఎవరినీ నొప్పించని హాస్యం మంచిదే’ అని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్