అగ్రస్థానంలో సూర్యకుమార్

59చూసినవారు
అగ్రస్థానంలో సూర్యకుమార్
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 బ్యాటింగ్‌ విభాగంలో భారత స్టార్ బ్యాటర్ సూర్యకుమార్‌ యాదవ్‌ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ప్రస్తుతం అతడు 861 పాయింట్లతో తొలి ర్యాంకులో నిలిచాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్‌ బ్యాటర్ ఫిల్ సాల్ట్ (788), రిజ్వాన్ (769), బాబర్ అజామ్ (761), మార్‌క్రమ్ (733) టాప్-5లో ఉన్నారు. భారత యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ (714) ఒక స్థానాన్ని మెరుగుపర్చుకుని ఆరో ర్యాంకుకు చేరాడు.

సంబంధిత పోస్ట్