TG: జోగులాంబ గద్వాల జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురిలో గురువారం మృతిచెందిన.. గొనుపాడు మెరిసా మృతదేహంపై ఉన్న తులం బంగారాన్ని గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. మార్చురీలో ఉన్న మృతదేహంపై ఉన్న బంగారం చోరీ కావడంతో.. మెరిసా కుటుంబ సభ్యులు షాక్కు గురయ్యారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.