AP ప్రభుత్వం పింఛన్ విషయంలో మరో నిర్ణయం తీసుకుంది. కొంతమంది విద్యార్థులు దివ్యాంగ పింఛన్‌లు పొందుతున్నారు. వారిలో కొందరు సొంత ఊరికి దూరంగా హాస్టల్స్, గురుకులాల్లో చదువుకుంటున్నారు. పెన్షన్ కోసం వారు ప్రతినెలా సెలవు పెట్టి ఊరికి రావడం ఆర్థికంగా ఇబ్బందిగా మారగా.. మరికొందరు ప్రయాణం చేయడానికి ఇబ్బందిపడుతున్నారు. ఈ సమస్యలకు చెక్ పెడుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వారి బ్యాంకు అకౌంట్‌లలోనే డబ్బులు జమ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు.