తమిళనాడులోని కడలూరు జిల్లాలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సజీవదహనమయ్యారు. హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగిగా పనిచేస్తున్న సుగంద్ కుమార్ తల్లి కమలేశ్వరి( 60)ని కలిసేందుకు కొడుకుతో కలిసి కరమణి కుప్పం చేరుకున్నాడు. అయితే సోమవారం తె. జా ఇంటి నుంచి పొగలు, దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనాస్థలానికి వచ్చి చూడగా ముగ్గురు మృతిచెంది ఉన్నారు. హత్య కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.