వందేభారత్ రైలులో ఓ వెయిటర్‌పై ప్రయాణికుడు దాడి చేశాడు. పశ్చిమ బెంగాల్‌లోని హవ్‌డా నుంచి రాంచీకి వందేభారత్ రైలులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి థాలీ ఆర్డర్ చేశాడు. అయితే ఒక వెయిటర్ పొరబాటున మాంసాహారం వడ్డించాడు. దీంతో కోపోద్రిక్తుడైన ప్రయాణికుడు వెయిటర్‌పై దాడికి దిగాడు. ఎంతమంది అడ్డుకున్నా ఆగకుండా వెయిటర్‌పై చేయి చేసుకున్నాడు. ఈ దాడికి సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.