ఇటలీ విపణిలో విలాసవంత కార్ల తయారీ సంస్థ ఆడి కార్యకలాపాలను చూసుకునే 62 ఏళ్ల ఎగ్జిక్యూటివ్ ఫాబ్రిజియో లాంగో ఓ పర్వతాన్ని ఎక్కుతూ ప్రమాదవశాత్తూ 10,000 అడుగుల ఎత్తు నుంచి పడిపోయి మరణించాడు. పర్వతారోహణపై ఆసక్తి పెంచుకున్న లాంగో, ఇటాలియన్- స్విస్ సరిహద్దుకు కొన్ని మైళ్ల దూరంలో జరిగిన ఈ ప్రమాదంలో చనిపోయాడు. అతని మృతదేహాన్ని హెలికాప్టర్ బృందం సుమారు 700 అడుగుల లోయలో గుర్తించింది.