కత్తిగాటు లేకుండా శవపరీక్ష

70చూసినవారు
కత్తిగాటు లేకుండా శవపరీక్ష
కత్తిగాట్లు లేకుండా వర్చువల్‌ అటాప్సీ విధానంలో శవపరీక్షలు చేసే వైద్యపరమైన సాంకేతికతను కేంద్రం అమల్లోకి తీసుకొచ్చింది. శవాన్ని బ్యాగుల్లో చుట్టి సాధారణ సీటీ, ఎమ్మారై స్కానింగ్‌ మాదిరిగానే ఇందులోనూ పరీక్షిస్తారు. అన్ని కోణాల్లోంచి పరిశీలించేలా ఇమేజెస్‌ జనరేట్‌ అవుతాయి. వాటి ఆధారంగా కండరాలు, కాలేయం, కిడ్నీ, ఇతర అవయవాల్లోని గాయాలను గుర్తిస్తారు. అంతర్గత రక్తస్రావం, అవయవ లోపాలు, అసాధారణ గాయాలతో పాటు కంటితో చూడలేని సూక్ష్మ తేడాలను వర్చువల్‌ అటాప్సీలో పరిశీలిస్తారు.

సంబంధిత పోస్ట్