ఎన్సీపీ నేత, మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయ్యింది. దాంతో బాంద్రాలోని సిద్ధిఖీ నివాసానికి ఆయన మృతదేహాన్ని తరలించారు. ఇవాళ రాత్రి 8.30 గంటలకు ముంబై లైన్స్‌లోని బడా ఖబ్రస్థాన్‌లో సిద్ధిఖీ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సిద్ధిఖీ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నట్లు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రకటించారు. శనివారం రాత్రి కిరాయి గూండాలు ఆయనను కాల్చి చంపిన విషయం తెలిసిందే.