57 ఏళ్ళ సాయిబాబా.. వీల్ ఛైర్‌లోనే పదేళ్ల పాటూ జైల్లో జీవించారు. ఈ కాలంలో ఆయన చాలా నరకం అనుభవించారు. కరోనా టైమ్‌లో అయితే మరీను. ఎన్ని సార్లు తన ఆరోగ్యం గురించి అప్పీలు చేసుకున్నా కోర్టులు పట్టించుకోలేదు. జైల్లో ఉన్న కాలంలో సాయిబాబా 21 రకాల అనారోగ్య సమస్యలకు గురయ్యారు. ఆయనకు గాల్‌బ్లాడర్ తొలగించి స్టంట్ వేసిన చోట డాక్టర్లు చీము తొలగించినప్పటికీ తీవ్రమైన పొత్తికడుపు నొప్పి, హైఫీవర్‌తో బాధపడ్డారు. చివరకు హార్ట్ ఎటాక్‌తో మరణించారు.