తాను జైల్లో ఉన్నా విద్యార్థులకు పాఠాలు చెబుతున్నట్లు, వారితో మాట్లాడుతున్నట్లు కలలు వచ్చేవి అన్నారు సాయిబాబా. ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటున్న వారిపై పోలీసులు అక్రమ కేసులు బనాయించటం సాధారణ విషయంగా మారుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భీమా కోరేగావ్ కేసులో తాను లేకపోయినా తనపై కేసు పెట్టారని చెప్పారు. రౌడీలు, పెద్ద నేరాలు చేసేవారు కూడా తక్కువ సమయంలో బయటకు వెళ్తారు కానీ.. ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్న వారికి మాత్రం కనీసం బెయిల్ కూడా రాదని వాపోయారు.