'బెడ్ పెర్ఫామెన్స్' అంటూ జీతాల కోత.. నెట్టింట వైరల్!

83చూసినవారు
'బెడ్ పెర్ఫామెన్స్' అంటూ జీతాల కోత.. నెట్టింట వైరల్!
బిహార్ లోని జమూయ్ జిల్లాలో ఆసక్తికర ఘటన జరిగింది. అక్కడి ప్రభుత్వ పాఠశాలల్లో సరిగ్గా పని చేయలేదంటూ 13మంది టీచర్ల జీతంలో కోతలు విధించారు. ఆ విషయాన్ని ఓ సర్క్యులర్ లో డీఈఓ తెలిపారు. అయితే 'బ్యాడ్ పెర్ఫామెన్స్'కు బదులు 'బెడ్ పెర్ఫామెన్స్' అని తప్పు దొర్లడంతో ఆ నోటీసు కాస్త సోషల్ మీడియాలో నవ్వులపాలైంది. జోకులు పేలుతుండటంతో జిల్లా యంత్రాంగం వెంటనే వివరణ విడుదల చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్