ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని బజాజ్ ఫైనాన్స్‌లో ఏరియా మేనేజర్‌గా పనిచేస్తున్న 42 ఏళ్ల తరుణ్ సక్సేనా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత రెండు నెలలుగా టార్గెట్లను చేరుకోవాలని సీనియర్లు తనపై ఒత్తిడి తెస్తున్నారని తరుణ్ ఒక నోట్‌లో పేర్కొన్నాడు. ఈ ఆరోపణలపై బజాజ్ ఫైనాన్స్ ఇంకా స్పందించలేదు. ఈ ఉదయం ఇంటి పనిమనిషికి తరుణ్ శవమై కనిపించాడు. తన భార్య, ఇద్దరు పిల్లలను మరో గదిలో బంధించాడు.