AI తో ఉద్యోగాలకు పెను ముప్పు: IMF చీఫ్ క్రిస్టాలినా

58చూసినవారు
AI తో ఉద్యోగాలకు పెను ముప్పు: IMF చీఫ్ క్రిస్టాలినా
కృత్రిమ మేధా(ఎఐ)తో ఉద్యోగాలకు పెను ముప్పు పొంచి ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) చీఫ్‌ క్రిస్టాలినా జార్జివా అన్నారు. జ్యూరిచ్‌లో జరిగిన ఓ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఎఐ ఉద్యోగ మార్కెట్‌పై సునామీలా విరుచుకుపడొచ్చని హెచ్చరించారు. వచ్చే రెండేళ్లలో ప్రపంచ వ్యాప్తంగా ఉపాధి అవకాశాల్లో సమూల మార్పులు చోటు చేసుకోనున్నాయని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్