ఎగిరి పడ్డ బైకర్ (వీడియో)

2601చూసినవారు
ఒడిశాలోని సంబల్‌పూర్ నగరంలో ఈ నెల 3న షాకింగ్ ఘటన జరిగింది. ఖేత్‌రాజ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్గాపాలి చౌక్‌లో రోడ్డుపై ఓ కారు యూటర్న్ తీసుకుంది. అదే సమయంలో ఓ బైకర్ వేగంగా దూసుకొచ్చాడు. కారును ఢీకొనడంతో ఆ బైకర్ గాలిలోకి ఎగిరి కింద పడ్డాడు. బాధితుడికి తీవ్రగాయాలు అయ్యాయి. స్థానికులు ఆ బైకర్‌ను ఆసుపత్రిలో చేర్పించారు. అయితే అతడి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :