మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రంతో ముగిసింది. అయితే, బీజేపీ నాయకులు ఓ హోటల్లో డబ్బులు పంచుతున్నట్లు చూపిస్తున్న వీడియో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాల్ఘర్ జిల్లాలోని విరార్‌లోని ఓ హోటల్లో బీజేపీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి వినోద్ తావ్డేతో సహా బీజేపీ నాయకులు డబ్బులు పంచుతున్నారని ప్రాంతీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఈ వీడియోను కాంగ్రెస్ పార్టీ ఎక్స్‌లో షేర్ చేసింది.