నాపై అసత్య ప్రచారానికి బీజేపీ రూ.500 కోట్లు ఖర్చు చేసింది: హేమంత్ సోరెన్

79చూసినవారు
నాపై అసత్య ప్రచారానికి బీజేపీ రూ.500 కోట్లు ఖర్చు చేసింది: హేమంత్ సోరెన్
తనపై అసత్య ప్రచారం చేసేందుకు బీజేపీ భారీ మొత్తంలో డబ్బులు ఖర్చు పెడుతోందంటూ జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌ ఆరోపణలు చేశారు. రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో బీజేపీ తనపై చేసిన ఆరోపణలపై ముఖ్యమంత్రి ఎక్స్‌ వేదికగా స్పందించారు. ప్రజల్లో నాపై విద్వేషాన్ని వ్యాప్తి చేసేందుకు కాషాయ పార్టీ ట్రై ఏకంగా రూ. 500 కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. సంకీర్ణ ప్రభుత్వం గురించి బూటకపు ప్రచారం చేసేందుకు 9 వేలకు పైగా వాట్సప్‌ గ్రూప్‌లను సృష్టించిందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్