కారం ఎక్కువగా తీసుకోవడం వల్ల వచ్చే ప్రధాన సమస్య అల్సర్. అంతేకాదు జీర్ణ సంబంధిత సమస్యలు కూడా వస్తాయి. ముఖ్యంగా గ్యాస్, కడుపుబ్బరం వంటి జీర్ణకోశ సమస్యలకు సైతం ఇది దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక ఎర్ర మిర్చిని ఎక్కువగా తినడం వల్ల కొన్ని సందర్భాల్లో డయేరియా బారిన పడే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. అందుకే కారాన్ని మితంగా తీసుకోవాలని సూచిస్తున్నారు.