పశ్చిమబెంగాల్ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం కొనసాగుతోంది. పోలింగ్ లో హింసాత్మక ఘటనల దృష్ట్యా భద్రత కట్టుదిట్టం చేసినా ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. డైమండ్ హార్బర్ లోని ఓ పోలింగ్ కేంద్రంపైకి దుండగులు బాంబులు విసిరారు. అయితే, ఈ పేలుడులో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని పోలీసులు తెలిపారు. హావ్ డాలోని ఓ పోలింగ్ కేంద్రాన్ని స్థానికులు ముట్టడించగా, పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.