కూరగాయల దుకాణానికి నిప్పంటించిన బాలుడు (వీడియో)

84చూసినవారు
ఓ బాలుడు కూరగాయల దుకాణానికి నిప్పంటించిన ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వీడియోలో ఓ బాలుడు తన తల్లితో కలిసి కూరగాయల మార్కెట్‌లో నడుచుకుంటూ వచ్చాడు. చేతిలో ఉన్న లైటర్‌తో మార్కెట్‌లోని కూరగాయల దుకాణానికి నిప్పు పెట్టాడు. దీంతో కూరగాయలకు మంటలు అంటుకున్నాయి. ఇది గమనించిన బాలుడి తల్లి.. ఏమీ పట్టనట్లుగా ఆ బాలుడిని అక్కడి నుంచి వెళ్లిపోయింది. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందనేది తెలియలేదు.

ట్యాగ్స్ :