TG: ప్రభుత్వ పథకాలపై బీఆర్ఎస్ నేతలు దుష్పచారం చేస్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. దేశవ్యాప్తంగా రైతులకు ఎప్పుడైనా మేలు జరిగిందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే అని ఆయన పేర్కొన్నారు. 2014 నుంచి 2023 వరకు రాష్ట్రంలో 6,121 మంది రైతుల ఆత్మహత్యకు కారణమైన గత ప్రభుత్వ నేతలు ఇప్పుడు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఆయన విమర్శించారు.