మంచు మోహన్ బాబు తనయుడు, నటుడు మంచు మనోజ్‌పై ఏ.రంగంపేట సర్పంచ్ ఎర్రయ్య హాట్ కామెంట్స్ చేశారు. మోహన్ బాబును నమ్ముకుని వేల మంది జీవనోపాధి పొందుతున్నారని అన్నారు. ఇక్కడ భూములు ధరల పెరుగుదలకు కారణం మోహన్ బాబు అని పేర్కొన్నారు. స్థానికులకు ఏ సమస్య తలెత్తినా మోహన్ బాబును సంప్రదిస్తామని, బయట నుంచి వచ్చిన వారు హాస్టల్స్ పెట్టుకుని బ్రతుకుతున్నారని చెప్పారు. మనోజ్ వచ్చి గొడవ చేసి.. మా కడుపు కొట్టవద్దని సర్పంచ్ ఎర్రయ్య కోరారు.