ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో నిలిపివేసిన అరకు ఉత్సవ్‌ను నిర్వహిస్తోంది. ఈ మేరకు అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఏర్పాట్లపై సమీక్ష చేశారు. ఈ నెల 31, ఫిబ్రవరి 1, 2 తేదీల్లో నిర్వహించే అరకు ఉత్సవ్‌ను సందర్శకులను ఆకట్టుకునేలా నిర్వహించనున్నారు. ఈ సమయంలో అరకు సందర్శించే పర్యాటకులకు అధికారులు ప్రత్యేక రాయితీలను అందించనున్నట్లు పేర్కొన్నారు.