రోహిత్ శర్మ కెప్టెన్సీపై బుమ్రా ఆసక్తికర వ్యాఖ్యలు

61చూసినవారు
రోహిత్ శర్మ కెప్టెన్సీపై బుమ్రా ఆసక్తికర వ్యాఖ్యలు
"రోహిత్ శర్మ కెప్టెన్సీ అద్భుతంగా ఉంది. ఆటగాడిగా రాణిస్తూ జట్టును నడిపించడం చిన్న విషయం కాదు. ఈ వరల్డ్ కప్ ప్రతీ మ్యాచ్‌లో రోహిత్ ఉత్సాహం చూస్తుంటే ముచ్చటేసింది. అతడి జోరు ఏమాత్రం తగ్గలేదు. ఆటగాళ్లకు పూర్తి స్వేచ్ఛ ఇస్తాడు. అతడి అనుభవాలను మ్యాచ్‌ సమయంలో ప్లేయర్లతో పంచుకుంటాడు. రోహిత్ నాయకత్వంలో ఆడటం బాగుంది. జట్టులోని ప్రతిఒక్కరి ఆత్మవిశ్వాసం అత్యుత్తమంగా ఉంది" అని జస్‌ప్రీత్ బుమ్రా తెలిపాడు.