కెనడాలోని అంతర్జాతీయ విద్యార్థులు, ఉద్యోగుల భాగస్వాములకు ఇచ్చే ఓపెన్ వర్క్ పర్మిట్ల వీసా నిబంధనలను అక్కడి ప్రభుత్వం సడలించింది. నిబంధనలకు లోబడి, అర్హులైన భాగస్వాములు ఈనెల 21 నుంచి వర్క్ పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. కెనడా ఆర్థికవ్యవస్థ, కార్మిక శక్తికి ఊతమిచ్చేందుకు తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా వేలాది మంది భారతీయులకు ప్రయోజనం కలగనున్నట్లు తెలుస్తోంది.