శరీరంలో అవసరమైన కణాల కంటే ఎక్కువ అభివృద్ధి చెంది.. కణతులుగా ఏర్పడతాయి. ఈ కణితులు రెండు రకాలుగా ఏర్పడతాయి. క్యాన్సర్ రహిత కణితి వల్ల ప్రమాదం ఉండదు. ఇది శరీరం ఒక చోట మాత్రమే పెరుగుతుంది. తొలగించిన తర్వాత మళ్లీ రాదు. అయితే, క్యాన్సర్ కణితి మాత్రం రక్తం ద్వారా ఇతర కణాలకు సైతం వ్యాపిస్తుంది. దీంతో శరీరంలోని ఇతర భాగాల్లో కూడా క్యాన్సర్ కణితులు ఏర్పడతాయి. అయితే శరీరంలో ఏర్పడే వివిధ రకాల క్యాన్సర్‌లకు వివిధ లక్షణాలు కనిపిస్తుంటాయి.