గోళ్లపై తెల్లటి మచ్చలకు కారణాలివే!

71చూసినవారు
గోళ్లపై తెల్లటి మచ్చలకు కారణాలివే!
సాధారణంగా గోళ్లు లేత గులాబీ రంగులో ఉంటాయి. అయితే కొంతమందికి గోళ్ల మధ్యలో తెల్లటి మచ్చలు ఏర్పడుతుంటాయి. గోళ్లపై ఉండే ఈ తెల్ల మచ్చలను ల్యూకోనిచియా అంటారు. శరీరంలో మెగ్నీషియం, జింక్, ఐరన్, కాల్షియం, సోడియం, కాపర్ లోపాల కారణంగా ఇవి ఏర్పడుతాయి. వెల్లుల్లి గోళ్ల ఆరోగ్యాన్ని బలపరుస్తుంది. ఇప్పుడు గోళ్లపై వెల్లుల్లి రెబ్బలను క్రమం తప్పకుండా రుద్దటం వల్ల గోళ్లకు బలం చేకూరడంతో పాటు తెల్ల మచ్చలు రాకుండా నివారిస్తుంది.