CCTV: ఇంటి ముందు చెప్పులు కొట్టేసిన దొంగ

77చూసినవారు
హైదరాబాద్ లోని అక్టోబర్ 1న జరిగిన ఓ షాకింగ్ వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. రెండు ఇళ్ల ఎదురుగా ఉన్న స్టాండ్‌లో ఓ దొంగ చెప్పులు చోరీకి ప్రయత్నించాడు. ఈ దృశ్యాలన్నీ అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. సీసీటీవీ ఫుటేజీలో అతడు చాలా ఈజీగా చెప్పులు దొంగిలిస్తున్నట్లు కనబడుతుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్