వికీపీడియాకు కేంద్రం నోటీసులు జారీ చేసింది. వెబ్సైట్ కంటెంట్‌లో తప్పులు ఉన్నాయని అందిన ఫిర్యాదుల మేరకు నోటీసులు పంపింది. వికీని పబ్లిషర్‌గా ఎందుకు గుర్తించకూడదో చెప్పాలని ఆదేశించింది. కాగా, ఈ వికీపీడియాలో కంటెంట్‌ని ఎవరైనా ఎడిట్ చెయ్యవచ్చు. దీంతో కొందరు తప్పుడు సమాచారం అందిస్తూ నెటిజన్లని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్రానికి ఫిర్యాదులు అందడంతో కేంద్రం వికీపీడియాకు నోటీసులిచ్చింది.