తెలంగాణలో డిసెంబర్ లోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతిలోపు పంచాయతీల పాలకవర్గం ఏర్పడుతుందని అన్నారు. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలోనే సర్పంచుల పాలన ముగియడంతో వారి స్థానంలో ప్రత్యేక అధికారులు కొనసాగుతున్నారు. ఇక కులగణన ఆధారంగా సర్పంచ్ ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 6 నుంచి కులగణన సర్వే జరగనుంది.