నేడు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి పల్లె నుంచీ దేశ, విదేశాల్లో ఐటీ రంగంలో స్థిరపడిన పిల్లలు కనీసం నలుగురైదుగురైనా ఉన్నారంటే, అది
చంద్రబాబు చలవే! ఉమ్మడి ఏపీకి సీఎంగా ఉన్నప్పుడు ప్రైవేటు రంగంలో భారీగా ఇంజినీరింగ్ కళాశాలలను ప్రోత్సహించి, ఐటీ అభివృద్ధికి బాటలు పరిచారు. సైబరాబాద్‌లో హైటెక్ సిటీని నిర్మించడం, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ ఐటీ సంస్థలను హైదరాబాద్‌కు రప్పించడం, ఐఎస్‌బీ, ట్రిపుల్ ఐటీ వంటి విద్యాసంస్థలను నెలకొల్పడంలో ఆయన కృషి అనన్య సామాన్యం.