చాట్ జీపీటీకి ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. దీన్ని వినియోగించే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతం ఓపెన్ఏఐ చాట్ జీపీటీకు వారానికి 400 మిలియన్ల మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారు. డిసెంబర్‌లో ఈ సంఖ్య 300 మిలియన్లుగా ఉంది. గతేడాదితో పోలిస్తే ఈ సంఖ్యలో చాలా పెరిగిందని, దీన్ని కేవలం వ్యక్తులు మాత్రమే కాదు, కంపెనీలూ వినియోగిస్తున్నాయని ఆ కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ బ్రాడ్ లైట్ క్యాప్ వెల్లడించారు.