పొన్నగంటి కూరతో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. దీనిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పొన్నగంటి కూర తినడం వల్ల డయాబెటీస్, క్యాన్సర్, బీపీ వంటి దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి. బరువు అదుపులో ఉంటుంది. ఈ ఆకుల రసాన్ని ముఖం మీద రాసుకుంటే చర్మ సంబంధిత సమస్యలు దూరమవుతాయి.