విటమిన్లు, మినరల్స్‌తో సహా అనేక పోషకాలు పాలలో ఉన్నాయి. అందుకే పాలను సూపర్ ఫుడ్ అంటారు. అంజీర్‌లో విటమిన్ ఎ, సి, కె లభిస్తాయి. చలికాలంలో అంజీర పండ్లు పాలు కలిపి తాగడం వల్ల హిమోగ్లోబిన్ పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంజీర్ పాలను కలిపి రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.