రెండు రూపాయలకే చికెన్ బిర్యానీ అనడంతో పోటెత్తిన జనం

1056చూసినవారు
రెండు రూపాయలకే చికెన్ బిర్యానీ అనడంతో పోటెత్తిన జనం
ఓ రెస్టారెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా రెండు రూపాయలకే చికెన్ బిర్యానీ అనడంతో కస్టమర్లు భారీగా చేరుకున్నారు. ఈ ఘటన తాజాగా ఏపీలోని తాడేపల్లిగూడెంలో జరిగింది. రూ.2కే బిర్యానీ ఇస్తామనడంతో దాదాపు 2 వేల మంది అక్కడకు చేరుకున్నారు. దీంతో తొక్కిసలాట జరిగి, కాస్త ఉద్రిక్తత చోటుచేసుకుంది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కాగా, రెస్టారెంట్ నిర్వాహకులు కేవలం 200 బిర్యానీ ప్యాకెట్లు మాత్రమే విక్రయించారు.

సంబంధిత పోస్ట్