కేంద్ర మంత్రి పదవి వద్దన్నసినీ హీరో

572చూసినవారు
కేంద్ర మంత్రి పదవి వద్దన్నసినీ హీరో
మలయాళ సినీ హీరో, బీజేపీ ఎంపీ సురేష్ గోపికి మోడీ కేబినెట్‌లో కేంద్ర సహాయ మంత్రి పదవి దక్కింది. అయితే తనకు ఆ పదవిపై ఆసక్తి లేదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మలయాళ వార్తా ఛానెళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో మాట్లాడారు. తాను మరో సినిమాలో నటించబోతున్నట్లు ఆయన చెప్పారు. అందు వల్ల మంత్రి పదవి వద్దని బీజేపీ అధిష్టానానికి చెప్పానని, కేంద్ర మంత్రి పదవి నుంచి తనను విడుదల చేస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.